గోప్యత & నిబంధనలు
గోప్యత & నిబంధనలు

డేటా బదిలీల కోసం చట్టబద్ధమైన పద్ధతులు

అమల్లోనికి వచ్చే తేదీ 23 ఆగస్టు, 2025 | ఆర్కైవ్ చేసిన వెర్షన్‌లు

మాకు ప్రపంచవ్యాప్తంగా సర్వర్‌లు ఉన్నాయి, అలాగే మేము మీ సమాచారాన్ని మీరు నివసిస్తున్న దేశం వెలుపల ఉన్న సర్వర్‌లలో ప్రాసెస్ చేయవచ్చు. డేటా రక్షణ చట్టాలు ఒక్కో దేశంలో ఒక్కో విధంగా ఉంటాయి, కొన్ని దేశాలలో ఇతర దేశాల కంటే రక్షణ ఎక్కువగా ఉంటుంది. మీ సమాచారం ప్రాసెస్ చేయబడే ప్రాంతంతో సంబంధం లేకుండా, మేము గోప్యతా పాలసీలో వివరించిన ఒకే రకమైన రక్షణలను వర్తింపజేస్తాము. డేటా బదిలీకి సంబంధించి, మేము దిగువ వివరించిన పద్ధతుల వంటి నిర్దిష్ట చట్టబద్ధమైన పద్ధతులను కూడా పాటిస్తాము.

రక్షణా స్థాయిపై నిర్ణయాలు

ఐరోపా ఆర్థిక మండలి (EEA) వెలుపలి దేశాల్లో కొన్ని వ్యక్తిగత సమాచారాన్ని తగినంతగా రక్షిస్తున్నట్లు ఐరోపా సంఘం గుర్తించింది, అంటే యూరోపియన్ యూనియన్ (EU), నార్వే, లిచెన్‌స్టెయిన్, ఐస్‌లాండ్ నుండి ఆ దేశాలకు డేటాను బదిలీ చేయవచ్చు అని అర్థం. UK, స్విట్జర్లాండ్, బ్రెజిల్ ఇలాంటి రక్షణా స్థాయి విధానాలను అవలంబించాయి. ఈ కింది రక్షణా స్థాయి విధానాలపై మేము ఆధారపడతాము:

EU-U.S. ఇంకా Swiss-U.S. డేటా గోప్యతా ఫ్రేమ్‌వర్క్

మా డేటా గోప్యతా ఫ్రేమ్‌వర్క్ సర్టిఫికేషన్‌లో వివరించిన విధంగా, EEA, స్విట్జర్లాండ్, అలాగే UK నుండి వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన కలెక్షన్, ఉపయోగం అలాగే నిల్వ కొనసాగింపునకు సంబంధించి US వాణిజ్య విభాగం నిర్దేశించిన EU-U.S. ఇంకా Swiss-U.S. డేటా గోప్యతా ఫ్రేమ్‌వర్క్‌లు (DPF), అలాగే EU-U.S DPFకు UK ఎక్స్‌టెన్షన్‌కు మేము కట్టుబడి ఉంటాము. Google LLC (అలాగే పూర్తి స్థాయిలో వారి అధీనంలో ఉన్న US సబ్సిడరీలతో సహా ప్రత్యేకంగా మినహాయిస్తే తప్ప) Google సంస్థ యావత్తూ DPF నియమాలకు కట్టుబడి ఉంటుందని సర్టిఫై చేయబడింది. మీ వ్యక్తిగత సమాచారం ఏదైనా మా తరఫున బయటి ప్రాసెసింగ్ కోసం ఏవైనా థర్డ్-పార్టీలతో షేర్ చేయబడితే, మీ గోప్యతా పాలసీలో "మీ సమాచారాన్ని షేర్ చేయండి" విభాగంలో వివరించిన ఉత్తరోత్తర బదిలీ నియమం ప్రకారం Google బాధ్యత వహిస్తుంది. DPF గురించి మరింత తెలుసుకోవడానికి, Google సర్టిఫికేషన్‌ను చూడటానికి, దయచేసి DPF వెబ్‌సైట్‌ను సందర్శించండి.

మీరు మా DPF సర్టిఫికేషన్‌కు సంబంధించి మా గోప్యతా పద్ధతుల పట్ల ఏదైనా విచారణ చేయాలనుకుంటే, మమ్మల్ని సంప్రదించవల్సిందిగా ప్రోత్సహిస్తున్నాము. US ఫెడరల్ ట్రేడ్ కమీషన్ విచారణ, అలాగే ఆదేశ అధికారాలకు Google కట్టుబడి ఉంటుంది. మీరు మీ స్థానిక డేటా ప్రొటెక్షన్ అథారిటీకి ఫిర్యాదు కూడా చేయవచ్చు, మీ సమస్యను పరిష్కరించే దిశగా మేము వారితో కలిసి పని చేస్తాము. నిర్దిష్ట సందర్భాలలో, DPF ఇతర మార్గాలలో పరిష్కారం కాని ఫిర్యాదులను పరిష్కరించేందుకు DPF అనుబంధాంశం Iలో వివరించినట్లుగా బాధ్యతాయుతమైన మధ్యవర్తిత్వాన్ని రిక్వెస్ట్ చేసే హక్కును అందిస్తుంది.

స్టాండర్డ్ ఒప్పంద నియమాలు

స్టాండర్డ్ ఒప్పంద నియమాలు (SCCలు) అనేవి పార్టీల మధ్య లిఖిత పూర్వక హామీలు, వీటిని సరైన డేటా సంరక్షణ ఛత్రాలను అందించడం ద్వారా కొన్ని దేశాల నుండి మూడవ దేశాలకు డేటా బదిలీలకు ఆధారంగా ఉపయోగించవచ్చు. SCCలు యూరోపియన్ కమిషన్ లేదా బ్రెజిలియన్ డేటా ప్రొటెక్షన్ అథారిటీ వంటి సంబంధిత నియంత్రణ అధికారం ద్వారా ఆమోదించబడ్డాయి, వాటిని ఉపయోగించే పార్టీలు వాటిని సవరించలేరు (యూరోపియన్ కమిషన్ స్వీకరించిన SCC లను మీరు ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు, బ్రెజిలియన్ SCCలను ఇక్కడ) చూడవచ్చు. UK, స్విట్జర్లాండ్ వెలుపల ఉన్న దేశాలకు డేటా బదిలీల కోసం అలాంటి నియమాలు కూడా ఆమోదం పొందాయి. మేము మా డేటా బదిలీల కోసం అవసరమైన చోట అలాగే రక్షణా స్థాయిపై నిర్ణయం ద్వారా కవర్ చేయని సందర్భాలలో SCCలపై ఆధారపడతాము. SCCల కాపీని మీరు పొందాలనుకుంటే, మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు.

Google Workspace, Google Cloud Platform, Google Ads, అలాగే ఇతర యాడ్‌లు, గణన ప్రోడక్ట్‌లతో సహా తన బిజినెస్ సర్వీస్‌ల కస్టమర్‌లతో ఒప్పందాల్లోనూ Google SCCలను కూడా పొందుపచవచ్చు. privacy.google.com/businesses‌లో మరింత తెలుసుకోండి.

కొత్త ట్యాబ్‌లో తెరవబడుతుంది(ఫుట్‌నోట్‌లో తెరుచుకుంటుంది)
  • Afrikaans
  • Bahasa Indonesia
  • Bahasa Melayu
  • Català
  • Čeština
  • Dansk
  • Deutsch
  • Eesti
  • English
  • English (India)
  • English (United Kingdom)
  • Español
  • Español (Latinoamérica)
  • Euskara
  • Filipino
  • Français
  • Français (Canada)
  • Gaeilge
  • Galego
  • Hrvatski
  • Isizulu
  • Íslenska
  • Italiano
  • Kiswahili
  • Latviešu
  • Lietuvių
  • Magyar
  • Malti
  • Nederlands
  • Norsk
  • Polski
  • Português (Brasil)
  • Português (Portugal)
  • Română
  • Slovenčina
  • Slovenščina
  • Srpski
  • Suomi
  • Svenska
  • Tiếng Việt
  • Türkçe
  • অসমীয়া
  • Ελληνικά
  • Български
  • ଓଡିଆ
  • Русский
  • Српски
  • Українська
  • ‫עברית‬
  • ‫اردو‬
  • ‫العربية‬
  • ‫فارسی‬
  • አማርኛ
  • मराठी
  • हिन्दी
  • বাংলা
  • ગુજરાતી
  • தமிழ்
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • മലയാളം
  • ไทย
  • 한국어
  • 中文 (香港)
  • 中文(简体中文)
  • 中文(繁體中文)
  • 日本語
Google యాప్‌లు
ప్రధాన మెనూ