Google Maps ఎండ్ యూజర్ అదనపు సర్వీస్ నియమాలు

చివరిగా సవరించబడినది: జూన్ 4, 2025

Google Maps లేదా Google Maps Platform సర్వీస్‌లను ఇంటిగ్రేట్ చేసే ఏదైనా థర్డ్-పార్టీ ప్రోడక్ట్‌లు లేదా సర్వీస్‌లను ఉపయోగించడం ద్వారా, మీరు ఎండ్ యూజర్‌గా, (1)Google సర్వీస్ నియమాలను, ఇంకా (2) ఈ Google Maps అదనపు సర్వీస్ నియమాల (“Maps అదనపు నియమాలు”)ను తప్పనిసరిగా అంగీకరించాలి. Maps అదనపు నియమాలు, Google Maps/Google Earth ఇంకా Google Maps/Google Earth APIల చట్టబద్ధమైన గమనికలను రెఫరెన్స్ చేయడం ద్వారా చేర్చబడతాయి.

దయచేసి ఈ డాక్యుమెంట్‌లన్నింటినీ జాగ్రత్తగా చదవండి. ఈ డాక్యుమెంట్‌లు అన్నింటినీ కలిపి “నియమాలు” అంటారు. మీరు మా సర్వీస్‌లను వినియోగిస్తున్నప్పుడు, మీరు మా నుండి ఏమి ఆశించవచ్చు, అలాగే మీ నుండి మేము ఏమి ఆశిస్తాము అనే విషయాలను ఈ సర్వీస్‌లు తెలియజేస్తాయి.

మీరు మీ Business Profileను మేనేజ్ చేయడానికి Google Mapsలో 'వ్యాపారి-మాత్రమే' ఫీచర్‌లను ఉపయోగిస్తుంటే, ఆ వినియోగానికి సంబంధించి, https://support.google.com/business/answer/9292476 లింక్‌లో పేర్కొన్న Google Business Profile నియమాలు వర్తిస్తాయి.

'మా గోప్యతా పాలసీ'ని చదవమని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము. మేము ఏ సమాచారాన్ని కలెక్ట్ చేస్తాము, ఎందుకు కలెక్ట్ చేస్తాము, అలాగే మీ సమాచారాన్ని మీరు ఎలా మేనేజ్ చేయవచ్చు, ఎగుమతి చేయవచ్చు, తొలగించవచ్చు అనే అంశాలను ఇది వివరిస్తుంది.

  1. లైసెన్స్. మీరు ఈ నియమాలను పాటిస్తున్నంత కాలం, Google సర్వీస్ నియమాలు Google Mapsను ఉపయోగించడానికి లైసెన్స్ ఇస్తాయి, అందులో ఈ కింద పేర్కొన్న వాటి కోసం వీలు కల్పించే ఫీచర్‌లు కూడా ఉంటాయి:

    1. మ్యాప్‌లను చూడటం, అదనపు గమనికలను అందించడం;

    2. KML ఫైల్‌లు, మ్యాప్ లేయర్‌లను క్రియేట్ చేయడం;

    3. ఆన్‌లైన్‌లో, వీడియోలో అలాగే ప్రింట్‌లో సరైన అట్రిబ్యూషన్‌‌తో కూడిన కంటెంట్‌ను బహిరంగంగా ప్రదర్శించడం.

  2. మీరు Google Mapsను ఉపయోగించి చేయడానికి అనుమతి ఉన్న నిర్దిష్ట పనులకు సంబంధించి మరిన్ని వివరాల కోసం, Google Maps, Google Earth, అలాగే Street Viewను ఉపయోగించడానికి సంబంధించిన అనుమతుల పేజీని దయచేసి చూడండి.

  3. నిషేధితమైన ప్రవర్తన. Google Mapsను ఉపయోగించడానికి లైసెన్స్ కావాలంటే, 2వ సెక్షన్‌ను మీరు తప్పనిసరిగా పాటించాలి. Google Mapsను ఉపయోగిస్తున్నప్పుడు, మీరు వీటిని చేయకూడదు (లేదా మీ ప్రతినిధిగా ఉన్న వారిని వీటిని చేయడానికి అనుమతించకూడదు):

    1. Google Mapsలో ఏదైనా భాగాన్ని తిరిగి పంపిణీ చేయడం లేదా విక్రయించడం లేదా Google Maps ఆధారంగా కొత్త ప్రోడక్ట్ లేదా సర్వీస్‌ను క్రియేట్ చేయడం;

    2. కంటెంట్‌ను కాపీ చేయడం (Google Maps, Google Earth, ఇంకా Street Viewను ఉపయోగించడానికి సంబంధించిన అనుమతుల పేజీ లేదా "న్యాయమైన వినియోగం"తో పాటు మేధోసంపత్తి చట్టం ప్రకారం అలా చేయడానికి మీకు అనుమతి ఉంటే తప్ప);

    3. భారీగా డౌన్‌లోడ్ చేయడం లేదా కంటెంట్‌కు సంబంధించి అనేక ఫీడ్‌లను రూపొందించడం (లేదా అలా చేయడానికి మరొకరిని అనుమతించడం);

    4. Google Mapsకు ప్రత్యామ్నాయమైన సర్వీస్‌లో లేదా అత్యంత దగ్గర ఫీచర్‌లు ఉన్న సర్వీస్‌లో ఉపయోగించడం కోసం, Google Mapsను ఉపయోగించి ఇతర మ్యాప్-సంబంధిత డేటాసెట్‌ను క్రియేట్ చేయడం లేదా పెంపొందించడం (మ్యాపింగ్ లేదా నావిగేషన్ డేటాసెట్, బిజినెస్ లిస్టింగ్‌లు డేటాబేస్, మెయిలింగ్ లిస్ట్ లేదా టెలీమార్కెటింగ్ లిస్ట్ వంటివి); లేదా

    5. Google అందించిన Android Auto వంటి నిర్దిష్ట ఫీచర్ ద్వారా అయితే మినహా, Google Mapsలోని ఏదైనా భాగాన్ని ఇతర వ్యక్తుల ప్రోడక్ట్‌లు లేదా సర్వీస్‌లతో పాటు, లేదా రియల్ టైమ్ నావిగేషన్ లేదా ఆటోమేటిక్ వెహికల్ కంట్రోల్‌కు అనుబంధంగా ఉపయోగించడం.

  4. వాస్తవ పరిస్థితులు; ప్రమాద అంచనా. మీరు Google Maps మ్యాప్ డేటా, ట్రాఫిక్, దిశలు ఇంకా ఇతర కంటెంట్‌ను ఉపయోగించినప్పుడు, వాస్తవ పరిస్థితులు మ్యాప్ ఫలితాలకు, కంటెంట్‌కు భిన్నంగా ఉన్నట్లు మీరు కనుగొనవచ్చు, కాబట్టి మీ స్వంత నిర్ణయాన్ని తీసుకోండి అలాగే మీ స్వంత బాధ్యతపై Google Mapsను ఉపయోగించండి. ఎల్లప్పుడూ, మీ ప్రవర్తనకు, తదనంతర పరిణామాలకు మీరే బాధ్యత వహించాలి.

  5. Google Mapsలో మీ కంటెంట్. మీరు Google Mapsను ఉపయోగించి అప్‌లోడ్ చేసిన, సమర్పించిన, స్టోర్ చేసిన, పంపించిన లేదా అందుకున్న కంటెంట్ Google సర్వీస్ నియమాలకు లోబడి ఉంటుంది, ఈ నియమాలలో “మీ కంటెంట్‌ను ఉపయోగించడానికి అనుమతి” అనే విభాగంలోని లైసెన్స్ కూడా ఒక భాగం. అయినప్పటికీ, మీ డివైజ్‌లో మాత్రమే ప్రత్యేకించి ఉండే కంటెంట్ (లోకల్‌గా స్టోర్ అయిన KML ఫైల్ వంటివి) Googleకు అప్‌లోడ్ అవ్వడం కానీ, సమర్పించబడటం కానీ జరగదు, కాబట్టి ఈ లైసెన్స్ పరిధిలోకి రాదు.

  6. ప్రభుత్వ ఎండ్ యూజర్‌లు. మీరు ప్రభుత్వ సంస్థ తరఫున ప్రతినిధిగా Google Mapsను ఉపయోగిస్తుంటే, ఈ కింది నియమాలు వర్తిస్తాయి:

    1. పాలక చట్టం.

      1. యునైటెడ్ స్టేట్స్ ఇంకా ఐరోపా యూనియన్‌లోని నగర లేదా రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు సంబంధించి, పాలక చట్టం ఇంకా స్థానిక స్థలానికి సంబంధించి Google సర్వీస్ నియమాల విభాగం వర్తించదు.
      2. యునైటెడ్ స్టేట్స్ ఫెడరల్ ప్రభుత్వ సంస్థలకు సంబంధించి, పాలక చట్టం ఇంకా స్థానిక స్థలానికి సంబంధించిన Google సర్వీస్ నియమాల విభాగం పూర్తిగా వీటితో రీప్లేస్ చేయబడుతుంది: “ఈ నియామాలు చట్టాల వైరుధ్యంతో సంబంధం లేకుండా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చట్టాలకు కట్టుబడి ఉంటాయి, వాటి ప్రకారం నిర్వచించబడతాయి అలాగే వాటికి అనుగుణంగా అమలు చేయబడతాయి. కేవలం ఫెడరల్ చట్టం అనుమతించిన పరిధి మేరకు మాత్రమే: (A) ఫెడరల్ చట్టం లేనప్పుడు, ఉన్నా వర్తించనప్పుడు కాలిఫోర్నియా రాష్ట్ర చట్టాలు వర్తిస్తాయి (వివాదం ఏ రాష్ట్రంలో మొదలైనా కాలిఫోర్నియా చట్టాలే దాన్ని డీల్ చేస్తాయి); అలాగే (B) ఈ నియమాలు లేదా Google Maps కారణంగా నేరుగా లేదా వాటితో పరోక్షంగా సంబంధం ఉండి ఏదైనా వివాదం తలెత్తితే, ఆ లిటిగేషన్ల పైన శాంటా క్లారా కౌంటీలోని ఫెడరల్ కోర్టుల్లో మాత్రమే విచారణ జరుగుతుంది. అదే విధంగా ఇరుపక్షాలు కూడా వారికి సంబంధించిన కేసులను విచారించేందుకు కోర్టులకు అధికారం ఉందని అంగీకరిస్తున్నారు.”

    2. U.S. ప్రభుత్వానికి ఉన్న పరిమిత హక్కులు.యునైటెడ్ స్టేట్స్ ఫెడరల్ ప్రభుత్వం, లేదా దాని తరఫున, Google Mapsను పూర్తిగా యాక్సెస్ చేయడం / వినియోగించడం అన్నది, Google Maps/Google Earth లీగల్ నోటీసుల (చట్టపరమైన గమనికల)లోని "U.S. ప్రభుత్వం పరిమితం చేసిన హక్కులు" విభాగానికి లోబడి ఉంటుంది.